AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI PRIYUDU
అహో ఒక మనసుకు నేడే
చిత్రం - అల్లరి ప్రియుడు
సంగీతం - ఎం ఎం కీరవాణి
సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
గానం - బాలుగారు, చిత్రమ్మ
24 Beat BGM
M - అహో... ఒక మనసుకు నేడే... 2 Beat పుట్టిన రోజు... 4 Beat
అహో.... తన పల్లవి పాడే... 2 Beat చల్లని రోజు... 4 Beat
ఇదే... ఇదే... కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు..
F - అహో... ఒక మనసుకు నేడే... పుట్టిన రోజు...
అహో.... తన పల్లవి పాడే... చల్లని రోజు...
36 Beat BGM
M - మాట పలుకు తెలియనిది
మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయె
కవితలు రాసే మౌనమది.....
F - రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరగని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది...
M - ఋతువుల రంగులు మార్చేది...
కల్పన కలిగిన మది భావం...
బ్రతుకును పాటగ మలిచేది...
మనసున కదిలిన మృదునాదం
F - కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకు దింపేది
తనే కదా వారధి
క్షణాలకే సారథి మనస్సనేది
అహో... ఒక మనసుకు నేడే... పుట్టిన రోజు...
M - అహో.... తన పల్లవి పాడే చల్లని రోజు...
40 Beat BGM
M - చూపులకెన్నడు దొరకనిది
రంగు రూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నాలెన్నో చూపినది....
F - వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కళగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమది...
M - చేతికి అందని జాబిలిలా..
కాంతులు పంచే మణిదీపం..
కొమ్మల చాటున కోయిలలా...
కాలం నిలిపే అనురా..గం..
F - అడగని వరములు కురిపించి
అమృతవర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి మనస్సనేది..
M - అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజు..
అహో.... తన పల్లవి పాడే చల్లని రోజు..
F - ఇదే... ఇదే...
Both - కుహూ స్వరాల కానుక..
మరో వసంత గీతిక.. జనించు రోజు..
BGM
Comments
Post a Comment