CHANGU BHALA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE OH BABY
చాంగు భళా చాంగు భళా
చిత్రం - ఓహ్ బేబీ
సంగీతం - మిక్కీ J మేయర్
సాహిత్యం - భాస్కరభట్ల
గానం - నూతన మోహన
M Ch - With The Rhythm In Your Feet
And The Music In Your Soul
Lift Your Hands To The Skies
And Say Ganesha
He’s Your Friend When You Need
He’s The Magic In Your Beat
Lift Your Hands To The Skies
And Say Ganesha
F - నేనే నేనా వేరే ఎవరోనా....
నేనే ఉన్నా సందేహంలోనా....
నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే..
నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే..
నా గుండె చూడు తొలి సారి గంతులు వేసే..
ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్ని సడి చేసే..
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా..
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
యౌవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ..
తిరిగివచ్చే నిజంగా..
నేనే నేనా వేరే ఎవరోనా....
నేనే ఉన్నా సందేహంలోనా....
BGM
F - ఇంత గొప్పగుంటుందా జీవితం..
ఇంద్రధనస్సు మెరిసినట్టుగా....
తిరిగివచ్చి చేరుకుంటె నా గతం..
తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా
ఊహలన్ని.. కిలకిలమంటు..
ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా
గుండెపాట.. గొంతుని దాటి..
పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
యౌవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ..
తిరిగివచ్చే నిజంగా..
BGM
F - లోకమంత కొత్తకొత్తగుందిగా..
పూల చెట్టు దులిపినట్టుగా....
ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా..
తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలా
తీరిపోని.. సరదాలన్ని.. తనివి తీరేలా తీర్చేసుకోవాలిగా
ఆశలన్ని.. దోసిట నింపి..
సీతాకోకలుగా వదిలేస్తే ఆనందం వేరుకదా
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..
యౌవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ..
తిరిగివచ్చే నిజంగా....
M Ch - With The Rhythm In Your Feet
And The Music In Your Soul
Lift Your Hands To The Skies
And Say Ganesha
He’s Your Friend When You Need
He’s The Magic In Your Beat
Lift Your Hands To The Skies
And Say Ganeshaa....
Comments
Post a Comment