YEMAINDHO TELIYADU NAAKU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MCA


ఏమైందో తెలియదు నాకు 

చిత్రం - MCA 
            సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
      సాహిత్యం - శ్రీమణి 
            గానం - కార్తిక్, దీపికా V 

BGM 

M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ.. 
నీ పేరే పాటయ్యింది పెదవులకు.. Bit 
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ.. 
నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు.. Bit 
F - ఈ మాయలో.. నిన్నిలా.. ముంచినందుకు.. 
నా పరిచయం.. వరమని.. పొగిడి చంపకు
M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ..
నీ పేరే పాటయ్యింది పెదవులకు..
ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ.. 
నా.. పైనే కురిసే ప్రతి వర్షం చినుకు..

BGM 

M - ఏ పువ్వుని చూస్తూ ఉన్నా.. నీ నవ్వే కనిపిస్తూందే.. 
ఎవరైనా కోస్తుంటే.. మరి గొడవైపోతుందే.. 
ఏ దారిన వెళుతూ ఉన్నా.. నువ్వెదురొస్తున్నట్టుందే.. 
ఎవరైనా అడ్డొస్తే.. తెగ తగువైపోతుందే.. 
F - విడి విడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఈ తంటా.. 
ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట.. 
M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ.. 
నీ పేరే పాటయ్యింది పెదవులకు.. 
F - నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకూ.. 
కాస్తయినా చెప్పను ఆ వివరం నీకూ.. 

BGM 

M - కనుపాపలు రెండున్నాయి.. 
చిరు పెదవులు రెండున్నాయి.. 
నా పక్కన వుంటావా.. నా రెండో మనసల్లే.. 
ఆ తారలు ఎన్నున్నాయి.. 
నా ఊహలు అన్నున్నాయి.. 
నా వెంటే వస్తావా.. నిజమయ్యే కలలల్లే.... 
F - ఇప్పటి వరకు పాదం వేసిన అడుగుల్నే చూసాను.. 
నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను.. 
M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు.. 
F - నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకూ.. 
నిన్నిట్టా చూస్తుంటె బావుంది నాకు.. 
BGM

Comments