AYYAPPA DEVAYA NAMAHA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DEVULLU



అయ్యప్ప దేవాయ నమః 

చిత్రం - దేవుళ్ళు 
  సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ గారు 
      సాహిత్యం - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు  
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు 

BGM 

Ch - ఆ... ఆ.. ఆ..   ఆ... ఆ.. ఆ.. 
M - అయ్యప్ప దేవాయ నమః.. Bit 
M - అభయ స్వరూపాయ నమః Bit 
M - అయ్యప్ప దేవాయ నమః.. Bit 
M - అభయ స్వరూపాయ నమః Bit
M - హరిహర పుత్రాయ నమః.. Ch - ఓం 
M - కరుణా సముద్రాయ నమః.. Ch - ఓం 
M - నిజ ధీర గంభీర శబరీ గిరిశిఖర
ఘన యోగ ముద్రాయనమః Ch - ఓం
M - పరమాణు హృదయాంతరాళ స్థితానంత 
బ్రహ్మాండరూపాయనమః Ch - ఓం
Ch & M - అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః..

BGM 

M - పద్దెంమ్ది పదిమట్ల పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామీ.. 
Ch - ఆ.. ఆ... ఆ..... 
M - ఇరుముడులు స్పృషియించి శుభమనుచు దీవించి 
జనబృందములచేరె జగమేలు స్వామి Bit 
M - తన భక్తులొనరించు తప్పులకు తడబడి.. 
ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి..
స్వామియేయ్.. శరణం అయ్యప్ప.. 
స్వాములందరు తనకు సాయంబు కాగా..
ధీమంతుడైలేచె ఆ కన్నెస్వామి Bit 
పట్టబంధము వీడి భక్తతటికై.. 
పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై Bit 
Ch & M - అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః..

BGM 

M - ఘోరకీకారణ్య సంసార యాత్రికుల
శరణుఘోషలు విని బ్రోచు శబరీషా Bit 
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానదీ తీర ఎరుమేలి వాసా 
Ch - ఆ.. ఆ.. ఆ.... ఆ... 
M - నియమాల మాలతో సుగుణాల మట్లపై
నడిపించి కనిపించు అయ్యప్పస్వామి.. Bit 
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి 
మహిమలను చూపించు మణికంఠస్వామి Bit 
కర్మ బంధము బాపు ధర్మశాస్తా..
కలి భీతి తొలిగించు భూతాధినేత Bit 
Ch & M - అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః..
Bit 
M - ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపం
అజ్ఞాన తిమిరమ్మునణచు శుభదీపం Bit 
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం Bit 
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
Ch - ఓం.... 
M - పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం...
Bit 
M - పంపానదీ తీర షంపాల తాత్వాన 
పాపాత్మ పరిమార్చు స్వామీ... 
భక్తులను రక్షించు స్వామీ.. 
Ch & M - శరణమయ్యప్ప శరణమయ్యప్ప 
శంభు విష్ణూతనయ శరణమయ్యప్ప.. 
శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియేయ్.. శరణమయ్యప్ప..
స్వామియేయ్.. శరణమయ్యప్ప..
ఓం శాంతి శాంతి శాంతిః.... 
ఓం శాంతి శాంతి శాంతిః.... 

  

Comments

Post a Comment