EM SANDEHAM LEDU SONG LYRICS IN TELUGU FROM OOHALU GUSAGUSALADE





ఏం సందేహం లేదు

                    చిత్రం - ఊహలు గుసగుసలాడె 
                సంగీతం - కల్యాణ్ కోడూరి 
                సాహిత్యం - అనంత్ శ్రీరామ్ 
    గానం - కల్యాణ్ కోడూరి, సునీత 

Bit 
M - ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందే చిలకా.. 
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ..
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

BGM 

F - Bit వెన్నెల్లో వున్నా Bit వెచ్చంగా వుంది నిన్నే ఊహిస్తుంటే
Bit ఎందర్లో వున్నా Bit ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలకా.. 
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ.... 
M - Bit వెన్నెల్లో వున్నా Bit వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే
Bit ఎందర్లో వున్నా Bit ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే

Whistle  

M - ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటోంది విన్నావా.. 
ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా..  
ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోనీ ఏం పరవాలేదన్నావా.. 
F - అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక.. 
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖ....

హ్మ్... హ్మ్... హ్మ్... హ్మ్... 

Comments