NEE TOLI CHOOPULONE SONG LYRICS IN TELUGU FROM JUSTICE CHOWDARY
నీ తొలిచూపులోనే
చిత్రం - జస్టీస్ చౌదరి
సంగీతం - చక్రవర్తిగారు
సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు
గానం - బాలుగారు, సుశీలమ్మ
BGM
M - నీ తొలిచూపులోనే...... Bit
ప్రేమకు పెళ్ళికి వంతెన
వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ
తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై..
అనురాగాలుగా మీటు వేళా..
F - నా తొలిచూపుతోనే...... Bit
నింగిని నేలకు వంచిన చెక్కిట
చిరు చుక్కగా ఉండిపోనా...
అల్లుకుపోయిన ఆశల ముంగిట
తొలిముగ్గులే దిద్దుకోనా..
నీ శ్రుతిలో సుస్వరమై.. నీ లయలో...
మనసుయ్యాలగా ఊగు వేళా..
BGM
M - చిగురు సొగసు చిదిమితేనే..
దీపమవ్వాలి నా కంటికీ..
తొడిమలన్నీ.. పూలు తొడిగీ..
తొలకరించాలి నీ నవ్వుకీ..
F - నీలి నింగీ.. తెల్ల మబ్బూ..
గొడుగు పట్టాలి నీ రాకకీ...
వాగువంకా వెల్లి విరిసీ
మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..
M - కన్నులలో..
F - ఆ ఆ ఆ..
M - హారితివై..
F - ఆ ఆ ఆ..
M - కౌగిలిలో..
F - ఆ ఆ ఆ..
M - శ్రీమతివై..
F - ఆ ఆ ఆ..
M - కరిగేది ఎన్నాళ్ళకో..
F - మది ఆలాపనై సాగు వేళా...
M - నీ తొలిచూపులోనే..
F - నింగిని నేలకు వంచిన చెక్కిట
చిరు చుక్కగా ఉండిపోనా...
BGM
F - కోకిలమ్మ.. కొత్త చీరా..
సారెలడగాలి మన పెళ్ళికీ..
కోనసీమా.. కొబ్బరాకు..
పందిరెయ్యాలి మన ఇళ్ళకీ..
M - మాఘమాసాలు.. ముందు రావాలి..
మంచి లగ్గాలు చూసీ..
రామచిలకల్ల ప్రేమ పలుకుల్లు
పెళ్ళి మంత్రాలు చేసీ...
F - కలలన్నీ..
M - ఆ ఆ ఆ..
F - కాపురమై..
M - ఆ ఆ ఆ...
F - మమతలకే..
M - ఆ ఆ ఆ..
F - గోపురమై..
M - ఆ ఆ ఆ...
F - కలిసేది ఎన్నాళ్ళకో..
M - శుభశకునాలు పలికేటి వేళా..
F - నా తొలిచూపుతోనే.. Bit
M - ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన
శుభలేఖలే చూసుకోనా
F - అల్లుకుపోయిన ఆశల ముంగిట
తొలి ముగ్గులే దిద్దుకోనా
M - నీ ఎదలో నా ఎదనే శారదవై
Both - అనురాగాలుగా మీటు వేళా..
Comments
Post a Comment