OM MAHAPRANA DEEPAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SRI MANJUNATHA






మహాప్రాణ దీపం

          చిత్రం - శ్రీ మంజునాథ 
      సంగీతం - హంసలేఖగారు 
సాహిత్యం - శ్రీ వేదవ్యాసగారు 
    గానం - శంకర్ మహదేవన్ గారు 

ఓం.. మహాప్రాణ దీపం.. శివం.. శివం.. 
మహోంకార రూపం.. శివం.. శివం.. 
మహాసూర్య చంద్రాగ్ని నేత్రం.. పవిత్రం.. 
మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం..
మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం.. 
భవానీ సమేతం.. భజె మంజునాథం.. 
ఓం...... నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ భవహరాయ చ
మహాప్రాణ దీపం.. శివం.. శివం.. 
భజె మంజునాథం శివం.. శివం....  
అద్వైత భాస్కరం.. అర్ధనారీశ్వరం.. 
త్రిదశ హృదయంగమం చతురుదతి సంగమం.... 
పంచభూతాత్మకం షట్ శతృ నాశకం..
సప్తస్వరేశ్వరం.... అష్టసిద్దీశ్వరం....
నవరస మనోహరం.... దశదిశా సువిమలం..
ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం.. 
ప్రస్తుతివ శంకరం ప్రణథ జన కింకరం..
దుర్జన భయంకరం.. సజ్జన శుభంకరం..
ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం
భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం 
ఈశం సురేశం ఋషేశం పరేశం 
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రం మార్షం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం..
ఓం.. నమో హరాయ-చ  స్మరహరాయ-చ
పురహరాయ-చ రుద్రాయ-చ భద్రాయ-చ
ఇంద్రాయ-చ నిత్యాయ-చ నిర్నిద్రాయ-చ
మహాప్రాణ దీపం.. శివం.. శివం.. 
భజె మంజునాథం.. శివం.. శివం....  
 డం-డం-డ  డం-డం-డ  డం-డం-డ  డం-డం-డ
ఢక్కా నినాద నవ తాండవాడంబరం
తద్ధిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల బంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం.. సామ ప్రగీతం అథర్వ ప్రభాతం
పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం పపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం
మహాకాల కాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
జఠాజూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసన్మాహా భానులింగం......  
మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం...... 
సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం
శ్రీ శైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం
మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం ఘ్రిష్మేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ... కేదార లింగే..శ్వరం.. 
అబ్లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సౌమాత్మకం.... 
అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం.. 
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..
అనాదిం అమేయం అజేయం అచింత్యం 
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థళ క్షేత్ర వర పరంజ్యోతిం........ 
ధర్మస్థళ క్షేత్ర వర పరంజ్యోతిం........ 
ధర్మస్థళ క్షేత్ర వర పరంజ్యోతిం................ 
ఓం... నమః సోమాయ చ సౌమ్యాయ చ
భవ్యాయ-చ భాగ్యాయ-చ శాంతయ-చ
శౌర్యాయ-చ యోగాయ-చ భోగాయ-చ
కాలాయ-చ కాంతాయ-చ రమ్యాయ-చ
గమ్యాయ-చ ఈశాయ-చ శ్రీశాయ-చ

శర్వాయ-చ సర్వాయ-చ.........   

Comments

Post a Comment