PODUSTHUNNA PODDU MEEDA TELANGANA SONG LYRICS IN TELUGU





పొడుస్తున్న పొద్దుమీద 

    చిత్రం - జై బోలో తెలంగాణ 
      సంగీతం - చక్రిగారు 
సాహిత్యం - గద్దర్ గారు 
    గానం - గద్దర్ గారు 

హ్హా.. 
అదిగో.. ఆ కొండల నడుమ తొంగి చూచే
ఎర్రని భగవంతుడు ఎవడు.. సూర్యుడు 
ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో.. 
పోటిపడి నడుస్తుంది కాలం.. 
అలా కాలంతో కదిలి నడిసినవాడే కదిలిపోతాడు.. 
ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం 

ఆ.. పొడుస్తున్న బలే బలే బలే బలే బలే బలే.. హ్హా.. హ్హా.. హ్హా.. 
ఆహా... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... 
పోరు తెలంగాణమా..పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..
బలే బలే బలే బలే బలే బలే.. హ్హా.. హ్హో.. హ్హా.. హ్హా.. 
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... 
పోరు తెలంగాణమా..పోరు తెలంగాణమా.. 
కోట్లాది ప్రాణమా.. కోట్లాది ప్రాణమా..

BGM 

ఓ భూతల్లి... సూర్యుని ముద్దాడిన భూతల్లి.. 
అదిగో.. చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది.. 
అమ్మా.. నీవు త్యాగాల తల్లివి.. త్యాగాల గుర్తు.. 
భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు.. 
చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. హ్హా..
మా భూములు మాకేనని భలే భలే భలే  భలే భలే భలే హ్హా..
మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరగ బడ్డ రాగమా.. 
మర్లబడ్డ గానమా.. తిరగ బడ్డ రాగమా.. 
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..
భలే భలే భలే  భలే భలే భలే... హ్హా.. హ్హో.. హ్హా.. హ్హో.. 
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... 
పోరు తెలంగాణమా..పోరు తెలంగాణమా.. 
కోట్లాది ప్రాణమా..

BGM 

అమ్మా గోదావరి.. నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం.. 
అమ్మా కృష్ణమ్మ.. కిల కిల నవ్వే కృష్ణమ్మ.. అమ్మా మీకు వందనం.. 
గోదావరి అలలమీద కోటి కలల గానమ.. 
కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా.. హ్హా.. 
మా నీళ్ళు భలే భలే భలే  భలే భలే భలే...హ్హా.. 
మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా..
కత్తుల కోలాటమా కన్నీటి గానమా.. పోరు తెలంగాణమా..  
కోట్లాది ప్రాణమా భలే భలే భలే  భలే భలే భలే... హ్హా.. హ్హో.. హ్హా.. హ్హో..  
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా.
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..

BGM 

అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది.. 
ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి.. ఆ పువ్వులు అలా ఆడుతాయి.. 
అదిగో పావురాల జంట నేనుప్పుడూ విడిపోనంటాది.. 
విడిపోయిన భంధమా.. చెదిరిపోయిన స్నేహమా.. 
యెడ బాసిన గీతమా.. ఎదల నిండ గాయమా హ్హా..
పువ్వులు పుప్పడిలా భలే భలే భలే  భలే భలే భలే... హ్హా..హ్హో..
పువ్వులు పుప్పడిలా.. పవిత్ర భంధమా.. పరమాత్ముని రూపమా..
పవిత్ర భంధమా.. పరమాత్ముని రూపమా..
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. 
భలే భలే భలే  భలే భలే భలే... హా..హ్హా.. హ్హో.. హ్హా.. హ్హో..  
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా.
పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..

BGM 

అదిగో.. రాజులు.. దొరలు.. వలస దొరలు.. 
భూమిని.. నీళ్ళని.. ప్రాణుల్ని.. సర్వస్వాన్ని చేరబట్టారు..
రాజుల కడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు..
రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా.. దొరవారి గడులల్లో భలే భలే భలే
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా..
ఆంద్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమ.. హ్హా.. 
మా పాలన  భలే భలే భలే  భలే భలే భలే... హ్హా.. హ్హో.. హ్హా.. హ్హో.. 
మా పాలన మాకేనని మండుతున్న గోలమా 
అమర వీరుల స్వప్నమా.. మండుతున్న హో.. 
మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా 
అమర వీరుల స్వప్నమా... 
అమర వీరుల స్వప్నమా... 

అమర వీరుల స్వప్నమా....... 

Comments

Post a Comment