RANGAMMA MANGAMMA SONG LYRICS IN TELUGU FROM RANGASTHALAM




రంగమ్మ మంగమ్మ

    చిత్రం - రంగస్థలం 
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు 
      సాహిత్యం - చంద్రబోస్ గారు 
గానం - ఎం ఎం మాన్సి 

Bit 
ఓయ్ రంగమ్మా మంగమ్మా 
ఓయ్ రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
గొల్ల భామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే.. 
గొల్ల భామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే.. 
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే 
ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా.. అంటూ ఊదడు.. 
ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ 
ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా.. అంటూ ఊదడు.. 
ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ 
ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే 
మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ..
మంచి న్నీళ్ళైనా సేతికియ్యడు
మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ..
మంచి నీళ్ళైనా సేతికియ్యడు
ఓయ్ రంగమ్మా మంగమ్మా..  
రంగమ్మా మంగమ్మా.. 
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.. 

BGM 

డూ టూ డుట్టుట్టూ.. Bit డూ టూ డుట్టుట్టూ 
డూ టూ డుట్టుట్టూ.. Bit డూ టూ డుట్టుట్టూ 
Bit 
హే.. రామ సిలకమ్మ.. రేగిపండు కొడుతుంటే ఏ.. 
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే..  
హే రామ సిలకమ్మ..  రేగిపండు కొడితే 
రేగి పండు గుజ్జు నా రైక మీద పడితే 
మరకమ్మ మరకమ్మ అంటే సూడదు 
మరు రైకైనా తెచ్చి ఇయ్యడు 
మరకమ్మ మరకమ్మ అంటే సూడదు 
మరు రైకైనా తెచ్చి ఇయ్యడు
రంగమ్మా మంగమ్మా..  Bit
రంగమ్మా మంగమ్మా.. Bit
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకో..డు

BGM  

నా అందమంత మూట కట్టీ.. అరె కంది సేనుకే ఎళితే.. 
ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే..
నా అందమంత మూట కట్టి కంది సేనుకెళితే 
కందిరీగలొచ్చి నను  సుట్టు ముడుతుంటే.. 
ఉశ్శమ్మా ఉశ్శమ్మా.. అంటూ తోలడూ.. 
ఉలకడు పలకడు బండ రాముడు
ఉశ్శమ్మా ఉశ్శమ్మ అంటూ తోలడూ.. 
ఉలకడు పలకడు బండ రాముడు.. 
రంగమ్మా మంగమ్మా..  Bit
రంగమ్మా మంగమ్మా.. Bit
హే రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకో..డు
ఏ.. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు 

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకో..డు

Comments