V6 BONALU SONG 2017 LYRICS IN TELUGU





V6 బోనాలు పాట

సంగీతం - భోలే శావళి 
సాహిత్యం - కందికొండ 
  గానం - తేలు విజయ, శంకర్, వరం, భోలే శావళి  


F - సూర్యున్నే బొట్టుగ బెట్టినవూ
బళ్ళాన్నే చేతిల బట్టినవు
మహమారీ తలలే నరికినవూ.. పెద్దమ్మా..
నరకానికి దుష్టుల దరిమినవూ..
కైలాసం వద్దని ఇడిసినవూ
కలియుగమే మాకై వచ్చినవూ
మా పిల్లల సల్లగ జూసినవూ.. మాయమ్మా..
పులిపై సవ్వారే జేసినవూ.. ఓయమ్మా..
అందుకె నీకు బోనాలెత్తుటమూ..
Bit
F - డోలు డోలు డోల్.. డోలమ్మ డోలు డోల్..
బోనాల పండుగే.. వచ్చింది డోలు డోల్..
Bit
F - డోలు డోలు డోల్.. డోలమ్మ డోలు డోల్..
బోనాల పండుగే.. వచ్చింది డోలు డోల్..
ఆ డోలు డోలు డోల్.. డోలమ్మ డోలు డోల్..
ఆ డోలు సప్పుడే.. మోగింది డోలు డోల్..
M - ఏ.. బువ్వకుండల నైవేద్యం....
సుట్టు సున్నపు సింగారం....
పసుపు కుంకుమ బొట్లందం
ఎలుగుతాంటె దీపంతం
ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం..
పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం..
డిల్లెమ్ బల్లెం కుడుకలు బెల్లం
తర్వాచన యాపకొమ్మలు చేసెను గానం
డిల్లెమ్ బల్లెం షావల కాలం
మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం..యో..
F - మాతల్లి డోలు డోల్.. పోచమ్మ డోలు డోల్
మాపాడి పంటలే సక్కంగ సూడు డోల్..

BGM

F - ఆ కనకదుర్గమ్మా.. కట్టమైసమ్మా..
లాలూ దర్వాజా లష్కరు మాంకాళమ్మా..
రేణుకెలమ్మా.. జుబ్లీ పెద్దమ్మా..
యాపచెట్టుకే ఉయ్యాల కడతామమ్మా
M - గుగ్గిలం వైసాచి గుమగుమా గుమగుమా
ఊరువాడ ఊదుబత్తి పొగలోయమ్మా..
నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా..
నీ మెడల వేస్తమే ముత్యాలమ్మా..
ఆషాఢ మాసానా ఐతారం రోజునా
గోలుకొండలా తొలి-బోనమెత్తుతం..
నీకు నాటుకోడి కోస్తం కల్లుసాచ బోస్తం..
డిల్లెమ్ బల్లెం కణకణకణ కణకణకణ
డిల్లెమ్ బల్లెం డంగ్ డంగ్ డంగ్ డంటనకన
F - డిల్లెమ్ బల్లెం బంగరు శూలం
బల్కంపేట ఎల్లమ్మకు బంతుల హారం
డిల్లెమ్ బల్లెం ఊదుత దూపం
నీకు ఉజ్జయినీ మహంకాళి ఊయల కడుతం
ఆ గజ్జె కట్టుతం కటం ఎత్తుతం
మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతం
రంగమెక్కుతం.. శివాలూగుతం..
ఆ శివుని శిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా..
M - ఓయ్..
Bit
F - పుట్టలలో పుట్టినవు సింగిడీ సింగిడీ
పువ్వులల్ల పెరిగినవూ సింగిడీ..
ఆ చండివి చాముండివమ్మ సింగిడీ సింగిడీ..
చతుర్భుజాలా తల్లీ సింగిడీ.. 
M - ఓ.. భవిష్యత్తును చెప్పవమ్మ రంగములో నిలబడీ..
F - బలియిస్తం జడిపిచ్చిన యాటపోతు భళి భళీ.. 
M - పోతురాజు ఈరయ్యాం.. శివశక్తుల కోలాటం.. 
ఘటం ముందు గంగరోళ్ళు మోయను భంభం.. 
జగ్గును థథజమిడికలు చేసెను ధూందామ్..  
డిల్లెమ్ బల్లెం.. డిల్లెమ్ బల్లెం..
డిల్లెమ్ బల్లెం హారతి పల్లెం
నీకు మావురాల ఎల్లమ్మ పాలతో స్నానం
డిల్లెమ్ బల్లెం బెల్లపు శాకం
ఆరగించి దీవించు సచ్చాన బోనం
F - పుట్టలలో పుట్టినవు సింగిడీ సింగిడీ..
పువ్వులల్ల పెరిగినవూ సింగిడీ..
ఆ చండివి చాముండివమ్మ సింగిడీ సింగిడీ..
చతుర్భుజాలా తల్లీ సింగిడీ..
మా తల్లీ డోలు డోల్ పోచమ్మా డోలు డోల్..
మాపాడి పంటలే.. సక్కంగ జూడు డోల్..
మాయమ్మా డోలు డోలు.. మైసమ్మా డోలు డోల్

గాలి ధూలినే సోకకుండ జూడు డోల్

Comments

Post a Comment