YAMAHA NAGARI KALAKATHA PURI SONG LYRICS IN TELUGU FROM CHOODALANI UNDI






యమహా నగరి 

      చిత్రం - చూడాలని ఉంది 
      సంగీతం - మణిశర్మగారు 
సాహిత్య - వేటూరి సుందరరామమూర్తిగారు 
      గానం - హరిహరన్ గారు 

Bit 

సరి మామగారి, సస సనిదపసా,,,, 
సరి మామగారి, సస సనిదపసా,,,,
రిమ దానిగప సా సనిదప మదపమరీ,,,,
యమహా నగరి.. కలకత్తా పురి..
యమహా నగరి కలకత్తా పురి..  
నమహో హూగిలి హౌరా వారధి.. 
యమహా.. నగరి.. కలకత్తా పురి..
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యా..గరాజు నీ కృతినే పలికెను మది 
యమహా నగరి.. కలకత్తా పురి..
నమహో హూగిలీ హౌరా వారధి..

Bit 

M Ch - య్యావ్ 
తత్ తత్ తవ్ తారారా బేబీ...  హేయియో.. 
తత్ తత్ తవ్ తారారా బేబీ...  క్రావ్.. 
తత్ తత్ తవ్ తారారా బేబీ... ఏయియో.. 
తత్ తత్ తవ్ తారారా బేబీ...  క్రావ్.. 
కొయ్యాలియా.. బాలోబాషీ... 

నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట
పాడనా.. తెలుగులో.. ఆ హంస పాడిన పాటే
ఆనందుడు చూపిన బాట సాగనా.. Bit 
పదుగురు పరుగు తీసింది పట్నం.. 
బ్రతుకుతో వెయ్యి పందెం.. కడకు చేరాలి గమ్యం.. కదలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల
బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..
యమహా.. నగరి కలకత్తా పురి..
నమహో హూగిలి హౌరా వారధి 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యా..గరాజు నీ కృతినే పలికెను మది 
యమహా.. నగరి కలకత్తా పురి.. 

BGM 

బెంగాలీ కోకిల బాల.. 
తెలుగింటి కోడలు పిల్ల మానిని.. సరోజిని....
రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ.. Bit 
పదుగురు ప్రేమలే లేని లోకం.. దేవతా మార్కు మైకం.. 
శరన్నవలాభిషేకం.. తెలుసుకోరా.. 
కథలకు నెలవట కళలకు కొలువట 
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగరపు కిటకటలో..
యమహా నగరి కలకత్తా పురి.. 
నమహో హూగిలి హౌరా వారధి 
చిరుత్యాగరాజు నీ.. కృతినే పలికెను మది 
చిరు.. త్యాగరాజు నీ.. కృతినే పలికెను మది 
యమహా నగరి కలకత్తా పురి....

BGM 

F Ch - పప్ పప్ పారా.. పబాబా పప్ పప్ పారా..
పప్ పప్ పారా.. పబాబా పప్ పప్ పారా..
రిబ్ బ రీబబ్బా.. పరాబరిబ రిబ్ బ రీబబ్బా..
రిబ్ బ రీబబ్బా.. పరాబరిబ రిబ్ బ రీబబ్బా..
వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే.. గీతిరా.. 
మాతంగి కాళీ నిలయ.. చోరంగి రంగుల దునియా నీదిరా.... 
వినుగురు సత్యజిత్ రే సితార.. ఎస్ డి బర్మన్ కి ధారా.. 
థెరెసా కీ కుమారా.. కదలిరారా..
జనగణ మనముల స్వరపద వనముల
హృదయపు లయలను శ్రుతి పరిచిన 
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో.. 
యమహా.. నగరి కలకత్తా పురి.. 
నమహో హూగిలి హౌరా వారధి.. 
యమహా.. నగరి కలకత్తా పురి.. 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరు త్యా..గరాజు నీ కృతినే పలికెను మది 
చిరు.. త్యాగరాజు నీ కృతినే పలికెను మది 
యమహా నగరి కలకత్తా పూరి.. 
నమహో హూగిలి హౌరా వారధి....


Comments