IDI CHERAGANI PREMAKU SREEKARAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANKUSAM





ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

      చిత్రం - అంకుశం 
            సంగీతం - సత్యం గారు 
            సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు 
  గానం - బాలుగారు, జానకమ్మ 

M - ఆ.... ఆ... ఆ.... 
F - ఆ.... ఆ... ఆ.... ఆ.. 
M - మ్.. మ్.. మ్.... 

BGM 

M - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. 
F - ఆ...ఆ...ఆ...
M - ఇది మమతల మేడకు ప్రాకారం.. 
F - ఓ... ఓ.... ఓ....
M - పండిన కలలకు శ్రీరస్తూ.. పసుపు కుంకుమకు శుభమస్తు..
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ....
కలకాలం.. వైభోగమస్తూ..
F - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. 
M - ఆ...ఆ...ఆ...
F - ఇది మమతల మేడకు ప్రాకారం..
M - ఓ... ఓ.... ఓ....
F - పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ...
కలకాలం.. వైభోగమస్తూ...

BGM 

M - కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ.. Bit 
F - పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
M - చిగురుటాశల.. చిలిపి చేతలూ..
పసిడిబుగ్గల పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ.. 
F - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
M - ఆ...ఆ...ఆ...
F - ఇది మమతల మేడకు ప్రాకారం..
M - ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
F - కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ..
M - కలకాలం వైభోగమస్తూ..

BGM 

F - ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వె శ్రీమతికి అందం.. Bit 
M - మింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
F - జన్మజన్మల.. పుణ్యఫలముగా..
జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం....
M - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
F - ఆ...ఆ...ఆ...
ఇది మమతల మేడకు ప్రాకారం
M - ఓ... ఓ.... ఓ....
పండిన కలలకు శ్రీరస్తూ 
F - పసుపు కుంకుమకు శుభమస్తు
Both - కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ.... 

కలకాలం వైభోగమస్తూ.. 

Comments