OHO CHELI.. IDI THOLI PATA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KANYAKUMARI







ఇది తొలి పాట..
      చిత్రం: కన్యాకుమారి (1977) 
    సంగీతం: బాలుగారు 
          గీతరచయిత: వేటూరిగారు  
నేపధ్య గానం: బాలుగారు 

Bit 

ఓహో చెలీ.. ఓ.. నా చెలీ.. 
ఇది తొలి పాట.. ఒక చెలి పాటా..
వినిపించనా.. ఈ పూట.. ఆ.. పాటా.. 
ఇది తొలి పాటా.. ఒక చెలి పాటా..
వినిపించనా ఈ పూటా.. ఆ.. పాటా..

BGM 

ఎదుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే 
మాటలన్ని పాటలై.. మధువులొలుకు మమతే పాట..
నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో.. 
నీ చల్లని చరణాలే.. నిలుపుకున్న వలపీ పాటా.. 
పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా....
పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. ఆడనా.. పాడనా
ఓహో చెలీ.. ఓ.. నా చెలీ..
ఇది తొలి పాట.. ఒక చెలి పాటా..  
వినిపించనా ఈ పూట.. ఆ.. పాటా.. 

BGM 

చీకటిలో వాకిట నిలిచి.. దోసిట సిరి మల్లెలు తొలిచి 
నిదుర కాచి నీకై వేచీ.. నిలువెల్లా కవితలు చేసి 
కదలి కదలి నీవోస్తుంటె.. కడలి పొంగులనిపిస్తుంటే 
వెన్నెలనై నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై 
పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా..
పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా.. ఆడనా.. పాడనా
ఓహో చెలీ.. ఓ.. నా చెలీ..
ఇది తొలి పాట.. ఒక చెలి పాటా..  
వినిపించనా ఈ పూట.. ఆ.. పాటా.. 
ఇది తొలి పాట.. హో హా.. 
ఇది తొలి పాట.. హ్మ్.. మ్.. 

ఇది చెలి పాటా.. 

Comments

Post a Comment