SAMAJA VARAGAMANA SONG LYRICS IN TELUGU FROM ALA VAIKUNTAPURAMLO






సామజ వరగమన 

చిత్రం - అల వైకుంఠపురంలో 
    సంగీతం - ఎస్ ఎస్ థమన్ గారు 
  సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు 
    గానం - సిడ్ శ్రీరామ్ 


నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

Bit 

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తా ఏ కాటుకలా నా కలలు 
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు 
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు 
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

Bit 

సామజ వరగమన.. నిను చూసి ఆగగలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున
సామజ వరగమన.. నిను చూసి ఆగగలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చూపులనల్లా తొక్కుకు వేళ్ళకు దయలేదా అసలు

BGM 

మల్లెల మాసమా.. మంజుల హాసమా.. 
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా.. 
విరిసిన పించమా.. విరుల ప్రపంచమా.. 
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా.. 
అరె నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా.. 
ఉలకవా.. పలకవా.. భామా....  
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా.. 
మదిని మీటు మధురమైన మనవిని వినుమా.. 
సామజ వరగమన.. నిను చూసి ఆగ గలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున
సామజ వరగమన.. నిను చూసి ఆగ గలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున

Bit 

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు 

ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు 

Comments