ABHINANDHANA MANDARA MALA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE TANDRA PAPARAYUDU




అభినందన మందారమాల

    చిత్రం - తాండ్ర పాపారాయుడు
  రచన - డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు
గానం - కె.జె ఏసుదాస్ గారు, పి.సుశీలగారు 

F - అభినందన మందారమాలా... Bit 
అభినందన మందారమాలా...
అభినందన మందారమాలా...
అధినాయక స్వాగత వేళ..
అభినందన మందారమాలా.. Bit 
స్త్రీ జాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాలా..
అధినాయక స్వాగతవేళ..
అభినందన మందారమాలా.. 

BGM 

M - వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నా వైపు పయణించెనా.. Bit 
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నా వైపు పయణించెనా..
F - వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.. 
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ 
నీ చూపు నా రూపు వరియించెనా.. 
నీ చూపు నా రూపు వరియించెనా.. 
M - నా గుండె పై.. నీవుండగా...
దివి తానె భువి పైనె దిగివచ్చెనా.. 
అభినందన మందార మాల..
అలివేణీ స్వాగత వేళ.. అభినందన మందారమాలా.. 
సౌందర్యమూ.. సౌశీల్యమూ.. 
నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి..
అభినందన మందారమాలా.. 

BGM 

F - వెండి కొండపై.. వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో.. Bit 
వెండి కొండపై.. వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో..
M - సగము మేనిలో ఒదిగిన దే..వత 
సగము మేనిలో ఒదిగిన దే..వత 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో.. 
నునుసిగ్గు తొణికిం..ది నీ తనువులో.. 
F - ప్రియ భావమే.. లయరూపమై.. 
అలలెక్కి ఆ..డింది అణువణువులో..
Both - అభినందన మందారమాల..
ఉభయాత్మల సంగమ వేళా..
అభినందన మందారమాలా.... 

Comments

  1. సి నా రె అందించిన మంచి సాహిత్యం

    ReplyDelete

Post a Comment