VANDANAM ABHIVANDANAM SONG LYRICS IN TELUGU FROM PREMABHISHEKAM
వందనం అభివందనం
చిత్రం - ప్రేమాభిషేకం
సంగీతం - చక్రవర్తి
సాహిత్యం - దాశరథి
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
వందనం... అభివందనం... నీ అందమే ఒక నందనం
వందనం... అభివందనం... నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం...
పాదాభివందనం... పాదాభివందనం...
వందనం అభివందనం నీ అందమే... ఒక నందనం..
BGM
కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో.. తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి
తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ..
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
BGM
జీవితమన్నది మూడునాళ్ళని
యౌవ్వనమన్నది తిరిగిరానిదని
ప్రేమన్నది ఒక నటనమనీ... నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి
ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ.
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం...
పాదాభివందనం పాదాభివందనం...
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
Comments
Post a Comment