SINGARALA PAIRULLONA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DALAPATHI
సింగారాల పైరుల్లోన
చిత్రం - దళపతి
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె జె ఏసుదాస్
BGM
బాలు - సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
ఏసుదాస్ - నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
బాలు - సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
ఏసుదాస్ - నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
Ch - ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట
బాలు - సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
ఏసుదాస్ - నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
BGM
బాలు - వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటారా... హోయ్
ఏసుదాస్ - బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే.. హోయ్
బాలు - మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటల్లోన నీవే వెయ్యరా.. హోయ్
ఏసుదాస్ - తెల్లవారగానే.. సంకురాత్రి కాదా.. పొంగే పాలు అందరి పాలు హాయిగా..
ఇద్దరూ - నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటె సందడేది లేదే.. హోయ్
బాలు - సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి..
ఏసుదాస్ - నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలీ...
Ch - ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట.. హొ హోయ్..
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి..
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి..
BGM
బాలు - బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా.. హ్హ హ్హా..
ఏసుదాస్ - మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే
ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట
బాలు - హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
ఏసుదాస్ - నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే..
బాలు - నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీ వేళ..
ఏసుదాస్ - తన మాటే నాకు వేదం అంట ఏ వేళా..
ఇద్దరూ - శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంట మే..మే..
బాలు - హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
ఏసుదాస్ - నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
Ch - ఈనాడు.. ఊరంతటా.. రాగాల.. దీపాలట..
నీకోసం.. వెలిగేనట.. ఉల్లాసం.. నీదేనట..
హొయ్ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి..
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి..
Comments
Post a Comment