KALAAVATHI/KALAVATHI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SARKARU VAARI PAATA
కళావతి
చిత్రం - సర్కారువారి పాట
సంగీతం - ఎస్ ఎస్ థమన్
సాహిత్యం - అనంత్ శ్రీరామ్
గానం - సిడ్ శ్రీరామ్
Ch - మాంగల్యం తంతునానేన
మమ జీవన హేతున..
కంటే భద్నామి శుభగే
త్వం జీవ శరదర్శనం..
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు
మీదికి దూకినాయా ఏందే నీ మాయా..
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా..
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే..
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్వే గతే నువ్వే గతీ
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్ లేకుంటే అధోగతీ..
Ch - మాంగల్యం తంతు నానేన
మమ జీవన హేతున..
కంటే భద్నామి శుభగే
త్వం జీవ శరదర్శనం..
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు
మీదికి దూకినాయా ఏందే నీ మాయా
BGM
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా..
రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే..
కళ్ళా అవీ కళావతీ..
కల్లోలమైందె నా గతీ..
కురులా అవీ కళావతీ..
కుల్లబొడిసింది చాలు తీ..
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్వేగతే నువ్వేగతీ
కం ఆన్ కం ఆన్ కళావతీ..
నువ్ లేకుంటే అధోగతీ
Ch - మాంగల్యం తంతునానేన
మమ జీవన హేతున
కంటే భద్నామి శుభగే
త్వం జీవ శరదర్శనం
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు
మీదికి దూకినాయా ఏందే నీ మాయా
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా
పాపప గమరి సా సా
నిస రీ పప పానీ దా...
పాపప గమరి సా సా
నిస రిమ నిప గమ రిసా...
Comments
Post a Comment