NEELALA NINGILO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE JEBU DONGA

 SONG

KARAOKE




నీలాల నింగిలో


    చిత్రం - జేబుదొంగ 

    సంగీతం - చక్రవర్తి 

    సాహిత్యం - ఆత్రేయ 

గాత్రం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల 


M - నీలాల నింగిలో మేఘాల తేరులో

ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో..  

నిలువెల్లా కరిగిపోనా.. నీలోన కలిసిపోనా.. 

F - నీలాల నింగిలో మేఘాల తేరులో

ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో..  

నిలువెల్లా కరిగిపోనా.. నీలోన కలిసిపోనా.. 

M - నీలాల నింగిలో..

F - మేఘాల తేరులో..ఓ ఓ..ఓ ఓ.. 

 

BGM 


M - ఆ.. నింగికి నీలం నీవై.. ఈ.. నేలకు పచ్చను నేనై 

F - రెండూ కలిసిన అంచులలో.. రేపు మాపుల సంధ్యలలో.. 

M - ఎర్రని పెదవుల ముద్దులుగా.. నల్లని కన్నుల సుద్దులుగా

ఎర్రని పెదవుల ముద్దులుగా.. నల్లని కన్నుల సుద్దులుగా

F - మెల్లగా..  చల్లగా..  

M - మెత్తగ మత్తుగ హత్తుకుపోయి 

F - నిలువెల్లా దొరికిపోనా.. నీలోన కలిసిపోనా.. 

M - నీలాల నింగిలో మేఘాల తేరులో..ఓ ఓ ..ఓ ఓ ..ఓ ఓ  


BGM 


F - ఆ.. హిమగిరి శిఖరం నీవై.. ఈ.. మమతల మంచును నేనై.. 

M - ఆశలు కాచే వేసవిలో.. తీరని కోర్కెల తాపంలో.. 

F - శివపార్వతుల సంబరమై.. గంగా యమునల సంగమమై... 

శివపార్వతుల సంబరమై.. గంగా యమునల సంగమమై... 

M - ఉరకల.. పరుగుల.. 

F - పరువములోన ప్రణయములోన.. 

M - నిలువెల్ల కరిగిపోనా నీలోన కలిసిపోనా.. 

Both - నీలాల నింగిలో మేఘాల తేరులో

ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో..  

నిలువెల్లా కరిగిపోనా.. నీలోన కలిసిపోనా.. 

నీలాల నింగిలో మేఘాల తేరులో

ఆ హా హా హాహా హా... 

ఓ హో హో  హో హో హో 

హ్మ్... హ్మ్... హ్మ్... హ్మ్... 



Comments