KALYANAM KAMANEEYAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PUSHPAKA VIMANAM
కళ్యాణం కమనీయం
చిత్రం - పుష్పక విమానం
సంగీతం - రామ్ మిర్యాల సాహిత్యం - కాసర్ల శ్యామ్ గానం - సిడ్ శ్రీరామ్ కోరస్ - మంగ్లీ, మోహన భోగరాజు, దివ్య, హరిప్రియ
BGM
Ch - అమ్మలాలో పైడి కొమ్మలాలో.. ముద్దుల గుమ్మలాలో..
సందళ్ళు నింపారే పందిళ్ళలో.. బంగారు బొమ్మలాలో..
మోగేటి సన్నాయి మోతలలో.. సాగేటి సంబరాలో..
కొయిలాలో రామ సిలకలాలో.. పలకండి మంతరాలో..
Sid - కళ్యాణం.. కమనీయం.. ఒకటయ్యే వేళనా.. వైభోగం..
కళ్యా...ణం కమనీయం... ఈ రెండు మనసులే.. రమణీయం
మూడే ముళ్ళట.. ముడి పడుతుంటే ముచ్చట..
నాలుగు దిక్కులకంట.. చూడ ముచ్చటైన వేడుకంట..
ఆ పంచ భూతాల తోడుగా.. ప్రేమ పంచుకొనే పండగంట
ఆరారు కాలాల నిండుగా.. ఇది నూరేళ్ళ పచ్చని పంట..
Ch - అమ్మలాలో పైడి కొమ్మలాలో.. ముద్దుల గుమ్మలాలో..
ఇంటిపేరు మారే ఈ తంతులో.. చుక్కలే అక్షింతలో..
మోగేటి సన్నాయి మోతలలో.. సాగేటి సంబరాలో..
పలకరించే తడి ఓ లీలలో.. పుట్టినింటి కళ్ళలో..
BGM
Sid - ఏడడుగులేయగ-ఈ అగ్ని మీకు సాక్షిగా..
ఏడూ జన్మలా.. బంధంగా..
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా..
మీ అనుబంధమే.. బలపడగా..
ఇక తొమ్మిది నిండితె నెలా.. నెమ్మ నెమ్మదిగా తీరే కల..
పది అంకెల్లో సంసారమిలా.. పదిలంగా సాగేటి అల..
ఒక్కటయ్యేనంటా ప్రాణం.. ఒకరంటే ఇంకొకరి-లోకం..
ఇద్దరు చెరో సగం.. ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం...
Ch - అమ్మలాలో పైడి కొమ్మలాలో.. ముద్దుల గుమ్మలాలో..
సందళ్ళు నింపారే పందిళ్ళలో.. బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతల్లలో.. సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో.. పలకండి మంతరాలో
అమ్మలాలో పైడి కొమ్మలాలో.. ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో.. బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతల్లలో.. సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో.. పలకండి మంతరాలో
Comments
Post a Comment