SRIVALLI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PUSHPA THE RISE
శ్రీవల్లీ
చిత్రం - పుష్ప ది రైజ్
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం - చంద్రబోస్
గానం - సిడ్ శ్రీరామ్
BGM
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే..
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే..
చూపే బంగారమాయనే శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయెనే....
చూపే బంగారమాయనే శ్రీవల్లి..
నవ్వే నవరత్నమాయనే..
BGM
అన్నిటికి ఎపుడూ... ముందుండే నేను
నీ ఎనకే ఇపుడూ.. పడుతూ ఉన్నాను..
ఎవ్వరికి ఎపుడూ... తలవంచని నేను..
నీ పట్టీ చూసేటందుకు... తలనే వంచాను..
ఇంత బతుకు బతికీ నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయెనే....
చూపే బంగారమాయనే.. శ్రీవల్లి..
నవ్వే నవరత్నమాయెనే.. ఏ.. ఏ..
Ch - లేలే లేలగ లేలే లే లగ లేలే లే లగ లేలే లే
లేలే లేలగ లేలే లే లగ లేలే లే లగ లేలే లే
లేలే లేలగ లేలే లే లగ లేలే లే లగ లేలే లే
BGM
నీ స్నేహితురాళ్ళు.. ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు..
పద్దెనిమిది ఏళ్ళు.. వచ్చాయా చాలు..
నువ్వే కాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు..
ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైన అందగత్తే
అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి..
మాటే మాణిక్యమాయెనే.. ఏ.. ఏ
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే.. ఏ.. ఏ..
BGM
Ch - లేలే లేలగ లేలే లే లగ లేలే లే లగ లేలే లే
లేలే లేలగ లేలే లే లగ లేలే లే లగ లేలే లే
Comments
Post a Comment