ANDAMA NEE PEREMITI ANDAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI PRIYUDU

 

VIDEO SONG

LYRICS

అందమా నీ పేరేమిటి


చిత్రం - అల్లరి ప్రియుడు 

      సంగీతం - ఎం ఎం కీరవాణి 

                  సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 

            గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


BGM 


అందమా.. .. .. నీ పేరేమిటి అందమా..  I 2 I

ఒంపుల హంపి శిల్పమా.. 

బాపు గీసిన చిత్రమా.. 

తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.. .. 

పరువమా.. .. .. నీ ఊరేమిటి పరువమా... I 2 I

కృష్ణుని మధురా నగరమా.. 

కృష్ణా సాగర కెరటమా.. 

తెలుపుమా.. తెలుపుమా.. తలుపుమా.. .. ..  

F - ఆ... ఆహ ఆహ ఆహా హహహా 

ఆ... ఆహ ఆహ ఆహా హహహా

Ch - (overlap)ఆహ ఆహ ఆహా హహహా 


BGM 


ఏ.. రవీంద్రుని భావమో గీతాం..జలి కళ వివరించే

ఎం..డ తాకని పం..డు వెన్నెల గగనమొలికె నా కన్నుల Bit 

ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించె

మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున

సంగీతమా.. .. ..  నీ నింగిలో.. .. .. 

విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ

తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.. .. 

అందమా.. .. .. నీ పేరేమిటి అందమా... 

తెలుపుమా.. .. .. నీ ఊరేమిటి పరువమా.. .. 


BGM 


భా..వ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే

హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా.. Bit 

తు..మ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే

మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా

ఓ కావ్యమా.. .. .. నీ తోటలో.. .. .. 

నవరస పోషణే గాలిగా నవ్విన పూలే మాలగా 

పూజకే.. సాధ్యమా.. తెలుపుమా.. .. .. .. 

అందమా.. .. .. నీ పేరేమిటి అందమా... I 2 I

ఒంపుల హంపి శిల్పమా.. 

బాపు గీసిన చిత్రమా.. 

తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.. .. .. 







Comments