INTHANDHAM DHARI MALLINDA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SITA RAMAM
ఇంతందం దారి మళ్ళిందా
చిత్రం - సీతారామం
సంగీతం - విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం - కృష్ణకాంత్
గానం - ఎస్ పి చరణ్
BGM
ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా
జగత్తు చూడనీ మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా
Ch - విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే
BGM
నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ..
వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ..
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
Ch - విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే
BGM
చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా
విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే
Ch - విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే
Comments
Post a Comment