OH SITA HEY RAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SITA RAMAM
ఓ సీతా
చిత్రం - సీతారామం
సంగీతం - విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం - అనంత్ శ్రీరామ్
గానం - ఎస్ పి చరణ్, రమ్య బెహ్రా
BGM
M - ఓ సీతా... వదలనిక తోడౌతా
రోజంతా... వెలుగులిడు నీడౌతా
దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా..
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
F - హాయ్ రామా... ఒకరికొకరౌతామా
కాలంతో... కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
జంటై జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా..
మెరుపులో ఉరుముల దాగుండే
నిజము చూడమ్మా
M - ఓ సీతా... వదలనిక తోడౌతా
హే రామా... ఒకరికొకరౌతామా
BGM
M - నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
F - ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయమో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో
BGM
F - నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
M - నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
F - ఎపుడు లేదే ఏదో వింత బాధే
Both - వంత పాడే క్షణం ఎదురాయే
F - కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా
హాయ్ రామా.. ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
M - దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
Comments
Post a Comment