JINTHAAK SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DHAMAKA
VIDEO SONG
KARAOKE
LYRICS
జింతక జింతక
చిత్రం - ధమాకా
సంగీతం - భీమ్స్
సాహిత్యం - కాసర్ల శ్యామ్
గానం - మంగ్లి, భీమ్స్
F - ఎంకన్న తీర్థంలో యాళ్ళ పొద్దు ముద్దంలో
పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్ కడుతుంటే
ఏ కన్ను సూడకుండా.. కన్ను నాకు కొడుతుంటే.. ఏ.. ఏ.. హే....
నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడబుద్దైతాంది రాజిగో
Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
F - చెయ్ పట్బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో
Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
M - అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో.. లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో..
భూమిపూజ చేసుకుంటె బుగ్గల్లో.. కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో..
F - నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది..
Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
M - నన్ను సూత్తే అట్నే ఉంటాది.. దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది..
Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
M - గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే..
గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే..
గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే..
గుంగురే-గురె గుంగురే-గురె గుంగురే-గుంగురే..
Bit
F - నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో
M - నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కలెక్కపెట్టాలే ఇయ్యాలో
F - రోజు మార్చాలిరా చేతి గాజులు నలిగి మూలగాలిరా సన్నజాజులు
M - పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు
F - ఓయ్ నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే నిన్ను జూత్తే.. ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టే.. హహ్హాహహ్హ
Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
M - నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
Ch - ఏయ్ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
BGM
F - నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో
నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో
M - ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరన్నే ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో
F - నువ్వు తిప్పుతు ఉండర మీసాలు నే తప్పుతు ఉంటా మాసాలు
M - అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంక చెద్దర్లో చేద్దామే తిరణాలు
F - హు నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
Ch - ఏయ్ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
M - నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్
Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క
F - నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
M - నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
Comments
Post a Comment