KOTHA KOTHAGA UNNADI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE COOLIE NO.1
కొత్త కొత్తగా ఉన్నది
చిత్రం - కూలి నెంబర్ ఒన్
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
Ch - ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...... ఆ....
Bit
M - కొత్త కొత్తగా.. ఉన్నది స్వర్గమిక్కడే.. అన్నది..
కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగా..నే.. నే... నే... నే...
F - కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది..
BGM
M - నా కన్ను ముద్దాడితే.. కన్నె కులుకాయే కనకాంబరం..
F - నా చెంప సంపెంగలో.. కెంపు రంగాయే తొలి సంబరం..
M - ఎన్ని పొంగులో కుమారి కొంగులో..
F - ఎన్ని రంగులో సుమాల వాగులో..
M - ఎన్ని పొంగులో కుమారి కొంగులో..
F - ఎన్ని రంగులో సుమాల వాగులో..
M - ఉద్యోగం ఇప్పించవా.. సోకు ఉద్యాన వనమాలిగా..
F - జీతం-ఇయ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా.. నా.. నా.. నా..
M - కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది..
F - కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగా..నే.. నే... నే... నే...
M - కొత్త కొత్తగా ఉన్నది.. స్వర్గమిక్కడే అన్నది..
Bit
Ch - ఆ.... ఆ... ఆ.... ఆ... ఆ...... ఆ....
BGM
F - నీ నవ్వు ముద్దాడితే.. మల్లెపువ్వాయే నా యవ్వనం..
M - నాజూకు మందారమే.. ముళ్ళ రోజాగ మారే క్షణం..
F - మొగలి పరిమళం మొగాడి కౌగిలి..
M - మగువ పరువశం సుఖాల లోగిలి..
F - మొగలి పరిమళం మొగాడి కౌగిలి..
M - మగువ పరువశం సుఖాల లోగిలి..
F - కండల్లొ వైశాఖమా.. కైపు ఎండల్లో కరిగించుమా..
M - తీగ మల్లికి.. నరాల పందిరి.. అందించుకోనా.. నా.. నా.. నా..
F - కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది
M - కోటి తారలే.. పూల ఏరులై..
కోటి తారలే పూల ఏరులై నేల చేరగా..నే.. నే... నే... నే...
F - కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది
Comments
Post a Comment