NEE NAVVU CHEPPINDI NAATHO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANTHAM
SONG
నీ నవ్వు చెప్పింది నాతో
చిత్రం - అంతం
సంగీతం - ఆర్ డి బర్మన్ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
BGM
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ళ లోటేమిటో..
హో.. లాలా లాల హో.. లాలా లా లాల
నీ నవ్వు చెప్పింది నాతో.. నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ళ లోటేమిటో..
BGM
నాకై చాచిన నీ చేతిలో.. చదివాను నా నిన్ననీ.. Bit
హో.. నాకై చాచిన నీ చేతిలో.. చదివాను నా నిన్ననీ..
నాతో సాగిన నీ అడుగులో.. చూసాను మన రేపుని..
పంచేందుకే ఒకరులేని.. బతుకెంత బరువో అని..
ఏ తోడుకి నోచుకోని.. నడకెంత అలుపో అని..
BGM
నల్లని నీ కనుపాపలలో.. ఉదయాలు కనిపించనీ.. Bit
నల్లని నీ కనుపాపలలో.. ఉదయాలు కనిపించనీ..
వెన్నెల పేరే వినిపించనీ.. నడిరేయి కరిగించనీ..
నా పెదవిలోనూ ఇలాగే.. చిరునవ్వు పుడుతుందనీ..
నీ సిగ్గు నా జీవితాన.. తొలిముద్దు పెడుతుందనీ..
BGM
ఏనాడైతే ఈ జీవితం.. రెట్టింపు బరువెక్కునో.. Bit
ఆ.. ఏనాడైతే ఈ జీవితం.. రెట్టింపు బరువెక్కునో..
తనువూ మనసూ చెరిసగమని.. పంచాలి అనిపించునో..
సరిగా అదే శుభముహూర్తం.. సంపూర్ణమయ్యేందుకు..
మనమే మరో కొత్త జన్మం.. పొందేటి బంధాలకు..
హో లాలా లాల.. హో.. లలా ల లాల
నీ నవ్వు చెప్పింది నాతో.. నేనెవ్వరో ఏమిటో..
నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ళ లోటేమిటో..
Comments
Post a Comment