MONNA KANIPINCHAVU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SURYA S/O KRISHNAN/SURYA SON OF KRISHNAN
SONG
మొన్న కనిపించావు
చిత్రం - సూర్య S/o క్రిష్ణన్
సాహిత్యం - వేటూరి సుందరరామ మూర్తి
గానం - నరేష్ అయ్యర్, ప్రశాంతిని
సంగీతం - హ్యారిస్ జయరాజ్
BGM
M - మొన్న కనిపించావు.. మైమరచిపోయాను..
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే.. Bit
ఇన్నెన్ని నాళ్ళైనా.. నీ జాడ పొడలేక..
ఎందెందు వెతికానో కాలమే వృధా-ఆయెనే
పరువాల నీ వెన్నెల.. కనలేని నా వేదన..
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా..
ఊరంతా చూసేలా అవుదాం జత..
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా..
ఊరంతా చూసేలా అవుదాం జత..
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా-ఆయెనే
BGM
M - త్రాసులో నిన్నే పెట్టి.. తూకానికి పుత్తడి పెడితే..
తులాభారం తూగేది.. ప్రేయసికే..
F - ముఖం చూసి పలికే వేళ.. భలే ప్రేమ చూసిన నేను..
హత్తుకోకపోతానా అందగాడా..
M - ఓ.. నీడవోలే వెంబడి ఉంటా.. తోడుగా చెలీ..
పొగవోలే పరుగున వస్తా.. తాకనే చెలీ..
వేడుకలు కలలు నూరు.. వింత ఓ చెలి..
F - మొన్న కనిపించావు.. మైమరచిపోయాను..
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా.. M - ఓ మై లవ్(overlap)
నీ జాడ పొడలేక.. M - ఎస్ మై లవ్(overlap)
ఎందెందు వెతికానో కాలమే వృధా-ఆయెనే..
BGM
F - కడలి నేల పొంగే అందం.. అలలు వచ్చి తాకే తీరం..
మనసు జిల్లుమంటుందీ.. ఈ వేళలో..
M - తలవాల్చి ఎడమిచ్చావే.. వేళ్ళు వేళ్ళు కలిపేశావే..
పెదవికి పెదవీ.. దూరమెందుకే..
F - పగటి కలలు కన్నా నిన్ను కునుకులేకనే..
హృదయమంత నిన్నే కన్న దరికిరాకనే..
నువ్వు లేక నాకు లేదు లోకమన్నదే..
M - మొన్న కనిపించావు.. మైమరచిపోయాను..
అందాలతో నన్ను.. తూట్లు పొడిచేసావే..
ఇన్నెన్నినాళ్ళైనా.. నీ జాడ పొడలేక..
ఎందెందు వెతికానో.. కాలమే వృధా-ఆయెనే..
పరువాల నీ వెన్నెల.. కనలేని నా వేదన..
ఈ పొద్దే.. నా తోడు.. వచ్చేయ్ ఇలా..
ఊరంతా.. చూసేలా.. అవుదాం జత..
ఈ పొద్దే.. నా తోడు.. వచ్చేయ్ ఇలా..
ఊరంతా.. చూసేలా.. అవుదాం జత..
వెన్నెలా.. వెన్నెలా.. వెన్నెలా
Comments
Post a Comment