AAKAASA DESANA(AAKASHA DESHANA) SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MEGHA SANDESHAM
SONG
ఆకాశదేశానా
చిత్రం - మేఘ సందేశం
సంగీతం - రమేశ్ నాయిడు
సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి
గానం - కె జె ఏసుదాస్
ఆకాశ దేశానా.. ఆషాఢ మాసానా..
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి.. మేఘసందేశం.. మేఘసందేశం..
BGM
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై..
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై..
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని Bit
ఉరమని తరమని ఊసులతో.. ఉలిపిరి చినుకుల బాసలతో..
విన్నవించు నా చెలికి.. విన్న వేదనా.. నా విరహ వేదనా....
ఆకాశదేశానా.. ఆషాడమాసానా..
మెరిసేటి ఓ.. మేఘమా.. మెరిసేటి ఓ.... మేఘమా....
BGM
రాలుపూల తేనియకై.. రాతిపూల తుమ్మెదనై..
రాలుపూల తేనియకై.. రాతిపూల తుమ్మెదనై..
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్ప జల-ధారలతో.... ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ.. మేఘమా.. మెరిసేటి ఓ.... మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి.. మేఘసందేశం.. మేఘసందేశం..
Comments
Post a Comment