CHELI SAKHI MANOHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BANGARU CHILAKA
SONG
LYRICS
చెలి.. సఖి.. మనోహరి
చిత్రం : బంగారు చిలక (1985)
సంగీతం : బాలు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి
BGM
M - చెలి.. సఖి.. మనోహరి.. మందార మౌన హాసిని
శ్రుతి లయ సుఖాలలో.. శృంగార వీణ మీటనా
F - ప్రియ సఖ మహోదయ.. నారింజ సంధ్య వేళలో
చలి చలి సయ్యాటలో.. పారాణి పాట పాడనా..
BGM
M - మనసే.. మరో ప్రపంచమై.. మేఘాల తేలగా
భువి అంచుల దివి ముంగిట.. నీ మేను తాకనా..
Bit
F - వయసే మరో వసంతమై.. పూలార బోయగా
తొలి చూపుల మునిమాపుల.. హారాలు వేయనా..
M - పొదరింటిలో చెలి చీకటి కౌగిళ్ళ నిండగా..
F - ప్రియ.. సఖ.. మహోదయ... నారింజ సంధ్య వేళలో..
M - చలి.. చలి.. సయ్యాటలో... పారాణి పాట పాడనా..
BGM
F - వలపే సుధా ప్రవాహమై... అధారాల నిండగా
ఒడివాకిట బిడియాలకు... అందాలు కూర్చనా..
Bit
M - సొగసే కళా సుగంధమై... పరువాలు పెంచగా
కనుపాపలా కసి ఊహల... ఉయ్యాలలూగనా..
F - నీ కౌగిట నే కాటుక... కావ్యాలు రాయనా..
M - చెలి సఖి మనోహరి... మందార మౌనహాసిని
F - శ్రుతి లయ సుఖాలలో... శృంగార వీణ మీటనా
M - చెలి F - సఖా Both - మ్హ్ హ్.... హ్.....
Comments
Post a Comment