ARE YEMAINDHI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE AARADHANA

 SONG


KARAOKE


LYRICS


అరె ఏమైందీ


చిత్రం - ఆరాధనా (1987)

సంగీతం - ఇళయరాజా 

సాహిత్యం - ఆత్రేయ 

గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి 


F - అరె ఏమైందీ.... BGM 

F - అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ

M - కలగాని F - కల ఏదో.. M - కళ్ళెదుటే నిలిచిందీ

F - అది నీలో మమతను నిద్దుర లేపింది.. 

M - ఆ ఆ ఆఆ... అరె ఏమైందీ..

ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ.... 


BGM 


F - నింగి వంగి నేల తోటి.. నేస్తమేదొ కోరింది

నేల పొంగి నింగి కోసం.. పూల దోసిలిచ్చింది

M - పూలు నేను చూడలేను.. పూజలేమి చేయలేను

నేలపైన కాళ్ళు లేవు.. నింగి వైపు చూపు లేదు

F - కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో

కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో

అది దోచావూ.. ఊఊ ఉ Bit 

లల-లల-లా లల-లల లల-లల లా M - హ్మ్... (overlap)

F - లల-లల-లా లల-లల-లా లల-లల-లా 

లల-లల-లల-లల లల-లల-లా..


BGM 


M - బీడులోన  వాన చినుకు.. పిచ్చిమొలక వేసింది

పాడలేని గొంతులోనా.. పాట ఏదొ పలికింది

F - గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు

మాటలన్ని దాచుకుంటే.. పాట నీవు రాయగలవు

M - రాతరాని వాడి రాత.. దేవుడేమి రాశాడో..

చేతనైతె మార్చి చూడు.. వీడు మారిపోతాడు

మనిషౌతాడూ.. ఊ..ఊ.. ఊ..ఉ

F - అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ..

అది ఏమైందీ.. తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ..

M - కలగాని F - కల ఏదో.. M - కళ్ళెదుటే నిలిచింది..

F - అది నీలో మమతను నిద్దుర లేపింది..

M - అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి

ఎక్కడికొ ఎగిరిందీ.. అది ఏమైందీ..




Comments