THEEGANAI MALLELU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE AARADHANA(1987)
SONG
చిత్రం - ఆరాధన (1987)
సాహిత్యం - ఆచార్య ఆత్రేయ
గానం - యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం - ఇళయరాజా
M - తీగనై.. మల్లెలు.. పూచినా వేళ..
ఆగనా.. అల్లనా.. పూజకో మాల..
మనసు తెర తీసినా.. మోమాటమౌనా..
మమత కలబోసినా.. మాట కరువేనా..
F - తీగనై.. మల్లెలు.. పూచిన వేళ..
ఆగనా.. అల్లనా.. పూజకో మాల..
BGM
M - తెలిసీ తెలియందా.. ఇది తెలియక జరిగిందా..
F - ఎపుడో జరిగిందా.. అది ఇపుడే తెలిసిందా..
M - ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా..
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా..
F - ప్రేమకన్నా పాశముందా.. పెంచుకుంటే దోషముందా..
తెంచుంకుంటే తీరుతుందా.. పంచుకొంటే మరిచేదా..
BGM
F - కలలో మెదిలిందా.. ఇధి కథలో జరిగిందా......
M - మెరుపై మెరిసిందా.. అది వలపై కురిసిందా..
F - రాసి ఉంటే తప్పుతుందా.. తప్పు నీదవునా..
మారమంటే మారుతుందా మాసిపోతుందా..
M - చేసుకున్నా పుణ్యముందా.. చేరుకునే దారి ఉందా..
చేదుకునే చేయి ఉన్నా చేయి చేయి కలిసేనా..
F - తీగనై.. మల్లెలు.. పూచిన వేళ..
ఆగనా.. అల్లనా.. పూజకో మాల..
మనసు తెర తీసినా.. మోమాటమేనా..
మమత కలబోసినా.. మాట కరువేనా..
M - తీగనై.. మల్లెలు.. పూచిన వేళ..
ఆగనా.. అల్లనా.. పూజకో మాల..
Comments
Post a Comment