ANUVANUVUU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE OM BHEEM BUSH

SONG


KARAOKE

LYRICS

అణువణువూ అలలెగసే


చిత్రం - ఓం భీమ్ బుష్ 

సంగీతం - సన్ని ఎం ఆర్ 

సాహిత్యం - కృష్ణకాంత్

గానం - అరిజిత్ సింగ్ 


BGM 


అణువణువూ.. అలలెగసే..  తెలియని ఓ ఆనందమే..   

కనులెదుటే.. నిలిచెనుగా..  మనసెతికే నా స్వప్నమే..    

కాలాలు కళ్ళార చూసేనులే  వసంతాలు వేచింది ఈ రోజుకే..   

భరించాను ఈ దూర  తీరాలు నీ కోసమే..   హే.... 

అణువణువూ అలలెగసే..  తెలియని ఓ ఆనందమే..   

కనులెదుటే.. నిలిచెనుగా..  మనసెతికే నా స్వప్నమే.. 


BGM 


ఓ చోటె ఉన్నాను  వేచాను వేడానుగా కలవమని..   

నాలోనే ఉంచాను  ప్రేమంత దాచనుగా పిలవమని..   

తారలైన తాకలేని  తాకుతున్న ప్రేమని  

కష్టమేది కానరాని  ఏది ఏమైన ఉంటానని   

కాలాలు కళ్ళార చూసేనులే  వసంతాలు వేచింది ఈ రోజుకే  

భరించాను ఈ దూర  తీరాలు నీ కోసమే.. హే..    

కలిసెనుగా కలిపెనుగా  జన్మాల భంధమే..  

కరిగెనుగా ముగిసెనుగా  ఇన్నాళ్ళ వేదనే..   

మరిచా ఏనాడో  ఇంత సంతోషమే..   

తీరే ఇపుడే  పాత సందేహమే..    

నాలో  లేదే  మనసే  నీతో చేరే..   

మాటే ఆగి పోయే పోయే పోయే  ఈ వేళనే..   

అణువణువూ అలలెగసెయ్  తెలియని ఓ ఆనందమే..   

కనులెదుటే నిలిచెనుగా  మనసెతికే నా స్వప్నమే


    

Comments