AREREY MANASA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE FALAKNUMA DAS
SONG
అరెరే మనసా
చిత్రం - ఫలక్నుమా దాస్
సంగీతం - వివేక్ సాగర్
సాహిత్యం - కిట్టు విస్సప్రగడ
గానం - సిడ్ శ్రీరామ్
ఏమన్నావో ఎదతో తెలుసా.. ప్రేమనుకోనా మనసా..
చూడకముందే వెనకే నడిచే.. తోడొకటుంది కలిసా..
తెలియదే.. అడగడం.. ఎదురై నువ్వే దొరకడం..
మాయనో ఏమిటో ఏమో.. ఓ ఓ
అరెరే మనసా.. ఇదంతా నిజమా..
ఇకపై మనమే.. సగము సగమా.. ఆ.. ఆ.. ఆ..
ఏమన్నావో ఎదతో తెలుసా.. ప్రేమనుకోనా మనసా..
BGM
నా బ్రతుకున ఏ రోజో.. ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే.. కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది.. నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన.. తోడే నువ్వే..
ఆ.. ఊరంతా మహరాజైనా.. నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే.. ఏ.. ఏ..
అరెరే మనసా..ఇదంతా నిజమా..
ఇకపై మనమే.. సగము సగమా.. ఆ.. ఆ.. ఆ..
BGM
నేనడిగిన రాగాలు.. నీ ప్రణయపు మౌనాలు..
నీ కురుళ సమీరాలు.. నే వెతికిన తీరాలు..
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి.. ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది.. నా వేకువలే..
ఆ.. ప్రాణాలే అరచేతుల్లో.. పెట్టిస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా.. ఆ.. ఆ..
అరెరే మనసా..ఇదంతా నిజమా..
ఇకపై మనమే.. సగము సగమా.. ఆ.. ఆ..
అరెరే మనసా.. (అరెరే మనసా - Counter)
ఇదంతా నిజమా.. ఇకపై మనమే.. సగము సగమా.. ఆ..
అరెరే మనసా.. ఇదంతా నిజమా..
ఇకపై మనమే.. సగము సగమా.. ఆ.. ఆ.. ఆ..
Comments
Post a Comment