TICKET EH KONAKUNDA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE TILLU 2(TILLU SUARE)
SONG
KARAOKE
LYRICS
టికెట్టే కొనకుండా
చిత్రం - టిల్లు 2
సంగీతం - రామ్ మిర్యాల
సాహిత్యం - కాసర్ల శ్యామ్
గానం - రామ్ మిర్యాల
BGM
టికెట్టే కొనకుండా లాటరి కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో సూడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర చాపే తగులుకుంది తీరింది కదరా
మురిసిపోకు ముందున్నాది కొంప కొల్లేరయ్యే తేది
గాలికి పోయే కంప నెత్తి కొచ్చి సుట్టుకున్నాది
ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటరు లేదు
ఏది ఏమైన గాని టిల్లుగానికడ్డే లేదు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్ ఏందీ హైరానా
టికెట్టే కొనకుండా లాటరి కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో సూడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర చాపే తగులుకుంది తీరింది కదరా
BGM
అల్లి గాడు మల్లి గాడు కాదు టిల్లు గాడు కిర్రాకీడు
మందులోకి పల్లీ లాగ లొల్లి లేకుండా ఉండ లేడు
తొందరెక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు
బోణి కొట్టకుండా నేను డాడీ నైపోయానంటాడు
అయ్యనే లెక్క జెయ్యడు ఎవ్వడయ్యెచ్చి జెప్పిన ఆగడు
పోరడు అస్సలినడు సిత్తరాలే సూపిత్తడు
ప్రేమిస్తడు పడి చస్తడు ప్రాణమిమ్మంటే ఇచ్చేస్తడు
తగులుకుండంటే వదులుకోలేడు బిడ్డ ఆగమై పోతున్నాడు..
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్ ఏందీ హైరానా
టికెటే కొనకుండా లాటరి కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో సూడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర చాపే తగులుకుంది తీరింది కదరా
Comments
Post a Comment