O PRIYATHAMA IDHI NIJAMA(A NEELI GAGANANA) SONG LYRICS IN TELUGU FROM THE MOVIE NUVVU NAAKU NACHAV

 SONG

KARAOKE

LYRICS


ఓ ప్రియతమా ఇది నిజమా(ఆ నీలి గగనాన)


చిత్రం - నువ్వు నాకు నచ్చావ్ 

సంగీతం - కోటి 

సాహిత్యం - భవనచంద్ర 

గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం  


BGM 


ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా.... 

ఎన్నెన్ని జన్మాలు వేచానో నే నిన్ను చేర.... 

ఏ నాటి స్వప్నం....  నీ దివ్యరూపం.... 

శతకోటి రాగాలు రమణించె నా గుండెలోన.. 

ఓ ప్రియతమా.... ఇది నిజమా..  ఈ పరిచయం..  ఒక వరమా.. 

ఇది మనసుపడిన విరహ వేదనా.. 

తొలి ప్రేమలోని మధుర భావనా.... 


BGM


ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా Bit 

ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా Bit 

నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో

వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో

ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్ఛాయొ చెప్పేదెలా

ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగా చూశాయొ ఆ గుట్టు విప్పేదెలా

ఓ ప్రియతమా..  దయ గనుమా....  నీ చూపే చాలు చంద్ర కిరణమా.... 

నా జన్మ ధన్యమౌనె ప్రాణమా.... 


BGM


చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో Bit 

చిరుగాలితో సెలయేటిపై నర్తించినా నెలవంకవో Bit 

నవ్వేమొ నాజూకు నడువేమొ పూరేకు నీ అందమే మందునే

పలుకేమొ రాచిలక నడకేమొ రాయంచ ఒళ్ళంత వయ్యారమే

నీ నామాన్నే శృంగార వేదంగా భావించి జపియిస్తున్నానే చెలి

నీ పాదాలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నే చెలి 

ఓ ప్రియతమా.. ఔననుమా.. కనలేవా ప్రియుని హృదయ వేదనా.. 

కరుణించు నాకు వలపు దీవెన.... 

ఆ నీలి గగనాన వెరిసేటి ఓ దివ్యతారా.. 

ఎన్నెన్ని జన్మాలు వేచానో నే నిన్ను చేర.. 

ఏ నాటి స్వప్నం..  నీ దివ్యరూపం.. 

శతకోటి రాగాలు రమణించె నా గుండెలోన.. 



Comments