NAA PELLAM NAA FAVOURITE SONG LYRICS IN TELUGU FROM THE MOVIE JANAKA AYITHE GANAKA
SONG
నా ఫేవరెట్టు నా పెళ్లామే
చిత్రం - జనక అయితే గనక
మ్యూజిక్ - విజయ్ బుల్గానిన్
సాహిత్యం - కృష్ణకాంత్
గానం - ఆదిత్య ఆర్కే
BGM
నేనేది అన్నా బాగుంది కన్నా
అంటూనే ముద్దాడుతావే
నీవే.. నా పక్కనుంటే చాలే..
కష్టాలు ఉన్నా కాసేపు అయినా
రాజాలా ఫోజు కొడతానే
నీవే.. నా పక్కనుంటే చాలే..
కలతలు కనబడవే..
నువ్వు ఎదురుగ నిలబడితే..
గొడవలు జరగవులే..
ఒడిదుడుకులు కలగవులే..
అర క్షణమైనా.. అసలెప్పుడైనా..
కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా..
పుణ్యమేదో చేసి ఉంటానే..
నేడు నేను నిన్ను పొందానే..
ఎన్ని జన్మలైనా అంటానే..
నా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాసాడే..
నీకు నాకు ముడి వేసాడే..
ఎన్ని జన్మలైనా అంటానే..
నా ఫేవరెట్టు నా పెళ్లామే.. ఓ.. ఆ..
BGM
హే ఉదయం నే లేచే ఉన్న వేచుంటానే
నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే Bit
హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కాదా మాఫీ
మన గదులివి ఇరుకువి కానీ
మన మనసులు కావే..
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే..
నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాటా..
గుండే కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట ఆ.. ఓ..
పుణ్యమేదో చేసి ఉంటానే..
నేడు నేను నిన్ను పొందానే..
ఎన్ని జన్మలైనా అంటానే..
నా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాసాడే..
నీకు నాకు ముడి వేసాడే..
ఎన్ని జన్మలైనా అంటానే..
నా ఫేవరెట్టు నా పెళ్లామే..
Comments
Post a Comment