OMPULA VAIKHARI/VAMPULA VAIKHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE APRIL 1 VIDUDALA
SONG
ఒంపుల వైఖరి
చిత్రం : ఏప్రిల్ 1 విడుదల(1991)
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - సిరివెన్నెల
గానం - ఎస్.పి.బాలు, చిత్ర
BGM
Ch - తురురు రుత్తురు తురురు రుత్తురు
తురురు రుత్తురు రూరూరూ
తురురు రుత్తురు తురురు రుత్తురు
తురురు రుత్తురు రూరూరూ రూ..
M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
M - మోవినీ మగతావినీ ముడివేయనీయవా..
F - కాదనీ అనలేననీ గడియైన ఆగవా..
M - అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలి..
Ch - హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలి..
M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి..
F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ హో.. Bit
M Ch - మాంగల్యం తంతునానే..న మమజీవన హేతునా..
కంఠే భద్నామి శుభకే.. త్వం జీవ శరదశ్యకం
త్వం జీవ శరదశ్యకం త్వం జీవ శరదశ్యకం.. Bit
F Ch - లాలి లాలి లాలి లాలి లాలి లాలి
లాలీ లాలీ.. లాలీ లాలీ....
M - కాంక్షలో కైపు నిప్పూ.. ఎంతగా కాల్చినా..
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా..
F - శ్వాసలో మోహదాహం.. గ్రీష్మమై వీచగా..
వాంఛతో వేగు దేహం మరయాగ వాటికా..
M - కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా..
F - మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా..
F Ch - హో... హో... హో... హో... హో...
M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి..
F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ హా..
BGM
M - నిష్ఠగా నిన్ను కోరీ.. నీమమే దాటినా..
కష్టమే సేద తీరే.. నేస్తమే నోచనా..
F - నిగ్రహం నీరుగారే.. జ్వాలలో నించినా..
నేర్పుగా ఈది చేరే.. నిశ్చయం మెక్కనా..
M - సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా..
F - మథనమే అంతమయ్యే అమృతం అందుకో..
F Ch - హో... హో... హో... హో... హో...
M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి..
F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ..
M - మోవినీ మగతావినీ ముడివే య నీయవా..
F - కాదనీ అనలేననీ గడి యైన ఆగవా..
M - అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలి..
F Ch - హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలి..
M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ హా....
Comments
Post a Comment